‘సింగరేణి’లో కరోనాతో చనిపోతే రూ.15లక్షల పరిహారం

ప్రకటించిన కేంద్ర బొగ్గు శాఖ మంత్రి

గోదావరిఖని, వెలుగు: కరోనాసోకి మరణించిన బొగ్గు గని కార్మికులకు రూ.15 లక్షల పరిహారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్‌‌జోషి వెల్లడించారు. కేంద్ర బొగ్గు శాఖ మంత్రికి బీఎంఎస్‌‌ అనుబంధ సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు కెంగెర్ల మల్లయ్య, ఉపాధ్యక్షులు పి.మల్లికార్జున్‌‌ , ఆర్జీ 1 కార్యదర్శి పర్లపల్లి రవి కార్మికుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయమన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా ఈ నిర్ణయం వర్తిస్తుందని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం సింగరేణి యాజమాన్యం కూడా మరో రూ.15 లక్షలు కార్మికుని కుటుంబానికి చెల్లించాలని వారు డిమాండ్‌‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.30 లక్షలు చెల్లించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

కరోనా పేషెంట్లకు స్పెషల్‌‌ లీవు
సింగరేణి గనుల్లో కరోనా వైరస్‌‌వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పాజిటివ్‌ ‌వచ్చినవారికి వేతనంతో కూడిన స్పెషల్‌‌ లీవు మంజూరు చేయాలని కార్మిక సంఘాలు, కార్మికుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు యాజమాన్యం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాజిటివ్‌‌ వచ్చిన కార్మికులు, వారితో కాంటాక్టు అయిన కార్మికులు డాక్టర్ల సూచన మేరకు ఐసోలేషన్‌‌లో 14 రోజులపాటు ఉండాలని, వారికి ప్రత్యేక లీవు మంజూరు చేస్తున్నట్టు కార్పొరేట్‌ ‌పర్సనల్‌ ‌జీఎం అన్ని ఏరియాల జీఎంలకు ఉత్తర్వుల కాపీని పంపించారు.

For More News..

అయోధ్య భూమి పూజకు 1,11,000 లడ్డూలు

ట్రంప్ కు ఆ పవర్ లేదు

అమెరికా జీపీఎస్‌‌‌‌‌‌‌‌కు డ్రాగన్ కంట్రీ సవాల్

సమస్యను కేటీఆర్ కు ట్వీట్ చేస్తే కేసులా!

Latest Updates