ప్రముఖ గాయకుడు పైలం సంతోష్ కన్నుమూత

ప్రముఖ గాయకుడు పైలం సంతోష్ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నల్లగొండ ప్రభుత్వ హాస్పటిల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఇవాళ చనిపోయారు. కట్టంగూర్ మండలం దుగినెల్లికి చెందిన పైలం సంతోష్.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. సంస్కృతిక కార్యక్రమాలతో ప్రజల్లో ఉద్యమ స్పూర్తి నింపారు. తెలంగాణ ప్రజల వలస బాధలను వివరిస్తూ పాడిన ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. ఆపాటతో ఆయన పైలం సంతోష్ గా మారారు. సంతోష్ పార్థివ దేహానికి నివాళి అర్పించారు తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‍. అంత్యక్రియలు రేపు ఆయన స్వగ్రామం దుగినెల్లిలో జరుగుతాయి.

Latest Updates