రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నానంటే..

ప్రముఖ నేపథ్య గాయని సునీత తన రెండో పెళ్లిపై తొలిసారిగా పెదవివిప్పి మాట్లాడారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ… రెండో పెళ్లి చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులను షేర్ చేసుకుంటూ కొద్దిగా ఎమోషన్ అయ్యారు. ఈనెల 9వ తేదీన హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ వద్ద ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సింగర్ సునీత-మ్యాంగో వీడియోస్ అధినేత రామ్ వీరపనేనిల పెళ్లి హిందూ సంప్రదాయ బద్దంగా జరిగిన విషయం తెలిసిందే. సింగర్ సునీత-రామ్ వీరపనేని ఇరువురికీ ఇది రెండో పెళ్లి. ఈ నేపధ్యంలో సంప్రదాయబద్దంగా ఇరుకుటుంబాల సమక్షంలో జరిగిన పెళ్లి గురించి సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. ఈ నేపధ్యంలో ఇవాళ ఓ జాతీయ మీడియాతో ఆమె తన పెళ్లి ముచ్చట షేర్ చేసుకున్నారు.

తన పెళ్లిపై తొలిసారిగా పెదవి విప్పిన సింగర్ సునీత

నా తల్లిదండ్రులు రెండో పెళ్లి చేసుకోమంటూ ఎంతగా ఒత్తిడి చేసినా..  పిల్లల కోసం పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయా. ముందే చిన్న వయసులో జరిగిన పెళ్లి.. విడాకుల ప్రభావం.. నా కెరీర్.. ఇవన్నీ నా పిల్లల మీద పడకుండా చూసుకున్నా.. కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నా.. ఓ వైపు పెద్దలు పెళ్లి చేసుకోమన్న ఒత్తిడి పెరిగిపోతోంది.. అన్నీ షేర్ చేసుకునేందుకు  ప్రతి మనిషికి ఓ తోడు ఉండాలని మా వాళ్లు నాముందే బలంగా వాదనలు వినిపిస్తున్న సమయంలో నాకూ పెళ్లి చేసుకోవాలన్నఆలోచన కలిగింది. అయితే  నా పిల్లల పరిస్థితి ఏమిటి..? వారు అడ్జస్ట్ కాగలరా.. అర్థం చేసుకుంటారా.. అనే విషయాలపై తర్జనభర్జనలు పడ్డా. చివరకు వారు కూడా సుముఖంగానే కనిపించారు.

ఈ పరిస్థితుల్లో రామ్ వీరపనేనితో బంధం గురించి ఆలోచించా, ఆయన చాలా కాలంగా నా సోషల్ మీడియా అకౌంట్లు చూస్తున్నమంచి వ్యక్తి, మా కుటుంబంలో కూడా అందరికీ తెలిసిన వ్యక్తే,  ఇరువైపులా పెద్దలు మాట్లాడుకున్నాక  పిల్లలకు చెబితే వారు సంతోషంతో పొంగిపోయారు. నాకు ఓ మనిషి తోడుండాలనుకుంటున్న తరుణంలో కనిపించిన మంచి మనసున్న మనిషి రామ్. పిల్లలు కూడా మా పెళ్లిని స్వాగతించడం చాలా సంతోషంగా ఉంది. రామ్ తో నా భావి జీవితం ఆనందంగా గడిచిపోతుందన్న నమ్మకం ఉంది. నా పెళ్లి గురించి కన్న కలలన్నీ రామ్ సాహచర్యంలో నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది. కరోనా నేపధ్యంలో పెళ్లి చాలా సింపుల్ గా జరిగిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో బంధువులతోపాటు కొద్ది మంది ప్రముఖులను ఆహ్వానించడం జరిగింది. అందరినీ పిలవడం ఇప్పట్లో సాధ్యమయ్యేదిగా కనిపించడం లేదు. అందుకే రిసెప్షన్ ఆలోచన చేయడం లేదు. కరోనా రూల్స్ వల్ల కొంత మందితో చిన్న చిన్న పార్టీలు చేసుకుంటూ..వస్తాము.. ఆ తర్వాత ఇద్దరమూ కలసి ఎక్కడైనా వెళ్లి వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటామని సింగర్ సునీత తన పెళ్లి ముచ్చట్లు పంచుకున్నారు.

ఇవీ చదవండి..

డ్రగ్స్ కేసులో నటుడు వివేక్ ఒబెరాయ్ బావ ఆదిత్య అల్వా అరెస్టు

వైరల్ వీడియో: నన్నే టికెట్ అడుగుతారా..? అంటూ వీరంగం

రూ.5 లక్షల నుంచి వెయ్యి కోట్ల కంపెనీగా విశాఖ

Latest Updates