మహిళలు అయ్యప్ప ఆలయానికి వెళ్లొద్దు… ఎందుకంటే

మహిళలు  శబరిమల అయ్యప్ప ఆలయానికి వెళ్లకూడదని వేడుకున్నారు ప్రముఖ గాయకుడు యేసుదాసు. 50 ఏళ్లలోపు మహిళలు శబరిమల వద్దకు వెళ్లకూడదని, తరతరాలుగా వస్తున్న శబరిమల సంప్రదాయాన్ని, క్షేత్ర ప్రాశస్త్యాన్ని కాపాడాలని మీడియాతో అన్నారు.

స్వామి దర్శనం చేసుకోవాలని కొండపైకి వస్తున్న వారిని, మాల ధారణ చేసిన స్వాములు చూడడం వల్ల వారి దీక్ష భగ్నం కావొచ్చని యేసుదాసు అన్నారు. అయ్యప్ప మాల ధరించేవారికి కొన్ని నియమాలుంటాయని, వారు స్త్రీల వైపు చూడకూడదని చెబుతూ.. ప్రస్తుతం కాలం మారింది కాబట్టి, దీక్ష తీసుకున్నవారు వృత్తి రీత్యా మహిళలతో మాట్లాడటం తప్పట్లేదని చెప్పారు. కానీ దీక్ష పూర్తి చేస్తే క్రమంలో ఆలయానికి ముడుపులు చెల్లించుకునేందుకు వచ్చే అయ్యప్ప స్వాములను మహిళలు ఇబ్బంది పెట్టకూడదని కోరారు. మహిళలు వారి ఆధునిక వస్త్రధారణతో శబరిమల ఆలయానికి వెళితే భక్తుల మనస్సు చలించవచ్చు. వారి మనసులో చెడు భావన కలగవచ్చు. వారి దీక్ష భగ్నం కావచ్చు. అందుకే శబరిమలకు వెళ్లవద్దని వేడుకుంటున్నానని ఆయన అన్నారు.

ఒకవేళ దైవభక్తి కోసం వెళ్లాలనుకుంటే మహిళలు వెళ్లడానికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అక్కడికి వెళ్లవచ్చు కదా అని ఆయన అన్నారు.

Singer Yesudas opposes young women's entry in Sabarimala

Latest Updates