ఒకే రోజు 57 వేల కరోనా కేసులు..764 మంది మృతి

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజుకు 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 57,117 కరోనా కేసులు నమోదవ్వగా 764 మంది చనిపోయారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 16,95,988 కు చేరగా మృతుల సంఖ్య 36,511 కు చేరింది. ఇందులో 10,94,374 మంది డిశ్చార్జ్ అవ్వగా 5,65,103 మంది కరోనా నుంచి కోలుకున్నారు. జులై 31న 5,25,689 కరోనా టెస్టులు చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా జులై 31 వరకు కరోనా టెస్టుల సంఖ్య 1,93,58,659 కు చేరింది. ఇక కరోనా కేసుల్లో ప్రపంచ వ్యాప్తంగా భారత్ మూడో స్థానంలో ఉంది.

 

Latest Updates