దేశంలో 23 లక్షలు దాటిన కేసులు..46 వేలు దాటిన మరణాలు

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతుంది. ప్రతి రోజు దాదాపు 60 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 60,963 కేసులు నమోదవ్వడంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 23,29,639 కు చేరింది. మరో 834 మంది చనిపోవడంతో దేశ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 46,091 కు చేరింది. దేశంలో 16,39,600 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 6,43,948 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇక ప్రపంచంలో కరోనా కేసుల్లో భారత్  మూడవ స్థానంలో కొనసాగుతుంది.

భారత్ లో నిన్న (ఆగస్టు 11న)7,33,449 మందికి కరోనా టెస్టులు చేశారు. దీంతో ఆగస్టు 11 నాటికి దేశ వ్యాప్తంగా కరోనా టెస్టుల సంఖ్య2,60,15,297 కు చేరింది.

Latest Updates