ప్రపంచం గుర్తించినా మనోళ్లు పట్టించుకోలే

19వ శతాబ్దంలో ఇండియాలో మలేరియా కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. చెడు గాలుల(మాల్ ఎయిర్)తో మలేరియా వ్యాపిస్తోందన్న అపోహ తప్ప, అదెలా వస్తుందన్నది అప్పటికీ ఎవరికీ తెలియదు. సికింద్రాబాద్ బ్రిటిష్ ష్రెసిడెంట్‌ డాక్టర్‌‌గా పని చేసిన సర్‌‌ రొనాల్డ్ రోస్‌,తన సొంత డబ్బులతో ఈ పెంకుటింటి భవనం (అప్పటి మిలిటరీ హాస్పిటల్)లో ఓ పరిశోధన శాలను ప్రారంభించారు. రెండేండ్లు అక్కడే పరిశోధన చేసి దోమల ద్వారా మలేరియా వ్యాపిస్తోందని ప్రయోగాత్మకంగా నిరూపించారు. దోమల్లో మలేరియా పరాన్న జీవులు ఎట్ల జీవిస్తున్నది, మనుషుల్లోకి వాటిని ఎట్ల ఇంజెక్ట్‌ చేస్తున్నది వివరించారు. ఇందుకు గానూ 1902లో ఆయన్ను నోబెల్‌ పురస్కారం వరించింది. ఓ లెక్కన చెప్పాల్నం టే ఇండియా నుంచి నోబెల్ అందుకున్న తొలి వ్యక్తి ఈయనే. నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్ లోని అల్మోర(ఉత్తరాఖండ్)లో పన్జేస్తున్న బ్రిటిష్ ఆర్మీ అధికారి దంపతులకు 1857లో రొనాల్డ్ జన్మించారు.ఇండియన్‌ మెడికల్‌ సర్వీస్‌ పూర్తి జేసి బ్రిటిష్ ఆర్మీ వైద్యుడిగా సేవలందించారు. 1895లో సికింద్రాబాద్‌ రెసిడెంట్ కు బదిలీ అయ్యారు. బేగంపేట పాత ఎయిర్‌‌పోర్టు ప్రాంతంలో ఉన్న ఆర్మీ ఆస్పత్రిలో, అరకొర వసతులతోనే మలేరియాపై పరిశోధనలు చేసి ఆయన విజయం సాధించారు.

రోస్మెమోరియల్ గా నామకరణం

1898లో రోస్‌ ఇక్కడ్నుంచి బదిలిపై కలకత్తా వెళ్లిపోయారు. 1932లో ఆయన చనిపోయాక,పరిశోధన శాలను రోస్‌ మెమోరియల్ గా నిజాం ప్రభుత్వం గుర్తించింది. ఆ తర్వాత పలువురి చేతులు మారి శిథిలావస్థకు చేరుకుంది. 1993లోఆ బిల్డిం గ్ ఉస్మానియా యూనివర్సిటీ ఆధీనంలోకి వచ్చింది. 1997లో బ్రిటన్ సహా 30దేశాలకుచెందిన 700 మంది సైంటి స్టులు ఆ బిల్డింగ్ ను సందర్శించి రోస్ కు నివాళులర్పిం చారు. చారిత్రక విశిష్టత కలిగిన ఆ భవనం పునరుద్ధరణకు అదే ఏడాది బ్రిటిష్ హై కమిషన్ లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేసింది. ఆ నిధులతో ఇంటా క్ (ఇండియన్ నేషనల్ ట్రస్ట్‌ ఫర్ హర్ట్‌ అండ్‌ కల్చరల్‌ హెరిటేజ్‌) సంస్థ భవనాన్ని పునరుద్ధరించింది. నిర్వాహణ బాధ్యతలు ఓయూకు అప్పగించినప్పటి కీ బిల్డింగ్, దాన్ని ఆనుకుని ఉన్న భూమి హక్కులు ఇప్పటికీ ఎయిర్‌‌ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) పేరిటే ఉన్నాయి.

వారసత్వ కట్టడంగా గుర్తింపు

అప్పటి వర్సిటీ అధికారులు, ఏఏఐ మధ్య సమన్వయ లోపంతో భవనం మళ్లీ శిథిలావస్థకు చేరుకుంది. 2009–10లో భారత పురావస్తు శాఖ ఈ భవనాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించిం ది.ఆ తర్వాత రోస్‌ పరిశోధనలను వివరిస్తూ ఓయూ‘రొనాల్డ్‌ రోస్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పారా సై టలజీ’పేరిట పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈరెండూ నా మమాత్రంగానే మారాయి. యాంటి మలేరియా డే , రోస్ జయంతి నాడు నివాళులర్పిస్తున్నారు. మిగతా రోజుల్లో బిల్డిం గ్ కు తాళంవేసి ఉంటోంది. రెం డేండ్లలో ఆ భవనాన్ని కేవలం 25 మంది మాత్రమే సందర్శించినట్టు సందర్శకుల బుక్ లో రాసి ఉంది. అయితే, ఏఏఐ చిన్నచూపే ప్రస్తుత పరిస్థితికి కారణమని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. మెయిన్‌ రోడ్డు నుంచి ఇనిస్టిట్యూట్ కు వెళ్లేం దుకు రోడ్డు వేయడానికి కూడా ఏఏఐ అనుమతించడం లేదంటున్నారు. ఆ భూమిహక్కులు తమకు బదలాయించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదంటు న్నారు.ఏడాదికి రూ.14 లక్షలు చెల్లిస్తే లీ జుకు ఇచ్చేందుకు ఏఏఐ సిద్ధం గా ఉన్నప్పటి కీ, అంత మొత్తం ఇవ్వడానికి తమ వద్ద నిధులు లేవని వర్సిటీ అధికారులు చెబుతున్నారు.

Latest Updates