జేమ్స్‌ బాండ్‌ పాత్రధారి సీన్ కాన‌రీ కన్నుమూత

ప్రముఖ హాలీవుడ్‌ నటుడు, జేమ్స్‌ బాండ్‌ పాత్రధారి సీన్ కాన‌రీ (90) కన్నుమూశారు. జేమ్స్ బాండ్ సీరీస్ తొలిసినిమాలో సీన్ కానరీ హీరోగా నటించాడు. జేమ్స్ బాండ్ సీరీస్ లో వచ్చిన 7 సినిమాల్లో సీన్ కానరీ నటించి మెప్పించాడు. అన్ టచబుల్, మార్నియే, మర్డర్ ఆన్ ది ఓరియంట్ ఎక్స్ ప్రెస్, ది మ్యాన్ హూ వుడ్ బి కింగ్, ది నేమ్ ఆఫ్ ది రోజ్, హై ల్యాండర్, ఇండియానా జోన్స్ అండ్ ది లాస్ట్ క్రూసేడ్, ది హంట్ ఫర్ రెడ్ అక్టోబర్, డ్రాగర్ హార్ట్, ది రాక్ అండ్ ఫైండింగ్ ఫారెస్టర్ సినిమాల్లో నటించారు. అన్ టచబుల్ సినిమాలోని నటనకు ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్నారు. సీన్ కానరీ కెరీర్‌లో రెండు బెఫ్ట( British Academy of Film and Television Arts), మూడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులను సొంతం చేసుకున్నారు.

Latest Updates