జాతీయ గీతం పాడుతూ ఏడ్చిన సిరాజ్

తండ్రిని గుర్తు చేసుకొని భావోద్వేగం

సిడ్నీ: థర్డ్​ టెస్ట్​కు ముందు జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో టీమిండియా పేసర్‌‌‌‌ మహ్మద్‌‌‌‌ సిరాజ్‌‌‌‌ కంటతడి పెట్టాడు. తన తండ్రి గుర్తుకు రావడంతో భావోద్వేగానికి గురయ్యానని చెప్పాడు. ‘నేను ఇండియా తరఫున టెస్ట్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ ఆడాలన్నది మా నాన్న కల. ఆయనకు టెస్ట్‌‌‌‌లంటే చాలా ఇష్టం. కనీసం ఒక్క మ్యాచ్‌‌‌‌ ఆడినా చూడాలనుకునేవారు. ఇప్పుడు ఆ టైమ్‌‌‌‌ వచ్చింది. కానీ మా నాన్న ఈ లోకంలో లేడు. అయినా నాన్న నన్ను చూస్తున్నారనే అనుకుంటున్నా. అందుకే కన్నీళ్లు ఆగలేదు’ అని సిరాజ్‌‌‌‌ పేర్కొన్నాడు. ఇక మ్యాచ్‌‌‌‌ విషయానికొస్తే.. లాస్ట్‌‌‌‌ రెండు మ్యాచ్‌‌‌‌లతో పోలిస్తే ఈసారి తాము చాలా ఓపిక చూపెట్టామన్నాడు. ఇప్పటికైతే  బ్యాటింగ్ ​ట్రాకే అయినా.. రాబోయే రోజుల్లో స్పిన్నర్లకు అనుకూలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘వికెట్‌‌‌‌ చాలా ఫ్లాట్‌‌‌‌గా ఉంది. బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌పై ఒత్తిడి పెంచడమే మా ప్లాన్‌‌‌‌. ఎందుకంటే పిచ్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌కు అనుకూలంగా ఉంది కాబట్టి. గత మ్యాచ్‌‌‌‌ల్లాగా బౌన్సర్లు కూడా సరైన రీతిలో పడలేదు. ఏదేమైనా టెస్ట్‌‌‌‌లంటేనే ఓపిక. ఇది మైండ్‌‌‌‌లో పెట్టుకుని ఆడితే చాలు. సెకండ్‌‌‌‌ డే ఏం జరుగుతుందో చూద్దాం. టైట్‌‌‌‌గా బౌలింగ్‌‌‌‌ చేసి ప్రెజర్‌‌‌‌ పెంచాలనుకుంటున్నాం’ అని సిరాజ్‌‌‌‌ వ్యాఖ్యానించాడు.

For More News..

నెలలుగా ఫ్లై ఓవర్ల నిర్మాణంతో రోడ్లు డ్యామేజ్

ఎమ్మెల్యే ✖ కార్పొరేటర్​.. ఒకే పని రెండుసార్లు ప్రారంభం

నేను రాను బిడ్డో..  గాంధీ దవాఖానకు!

Latest Updates