సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అరుదైన గౌరవం

రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అరుదైన గౌరవం ద‌క్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కాయకల్ప అవార్డులలో జిల్లా ఆసుపత్రుల విభాగంలో సిరిసిల్ల జిల్లా ఆసుపత్రి మొదటి స్థానం కైవసం చేసుకుంది. మెరుగైన సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ, స్వచ్ఛత ప్రమాణాల ప్రాతిపదికన ఆస్పత్రులకు కేంద్రం ఏటా ఇచ్చే ఈ పురస్కారాలలో ఈ సంవత్సరం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన ఆసుపత్రి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని 16.66 లక్షల రూపాయల అవార్డును అందుకోనుంది. ఈ విష‌యంపై రాష్ట్ర మంత్రి కే తారకరామారావు హ‌ర్షం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్, సిబ్బందికి జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు . వైద్యులు, సిబ్బంది యొక్క కృషితో ఈ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందని కలెక్టర్ తెలిపారు.

Latest Updates