న్యూజెర్సీతో తెలంగాణ ఒప్పందం

అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంతో సిస్టర్ స్టేట్ పార్ట్ నర్ షిప్ అగ్రిమెంట్ ను  కుదుర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఐటీ, మున్సిపాల్ శాఖమంత్రి కేటీఆర్ సమక్షంలో సీఎస్ SK జోషి, న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ మర్ఫీలు ఒప్పందంపై సంతకాలు చేశారు. తెలంగాణలో వాణిజ్య అనుకూల వాతావరణం ఉందన్నారు న్యూజెర్నీ గవర్నర్. ఈ ఒప్పందంతో ఇరు రాష్ర్టాలు విద్య, వ్యాపార, వాణిజ్య అవకాశాల్లో పరస్పరం సహాకరించుకుంటాయని తెలిపారు. న్యూజెర్సీతో జరిగిన ఒప్పందం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు మంత్రి కేటీఆర్.

Latest Updates