మోడీని కలవడానికి వచ్చిన అక్కాచెల్లెళ్లు

మోడీని కలవడానికి వచ్చిన అక్కాచెల్లెళ్లు

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలవడానికి అక్కాచెల్లెళ్లు హైదరాబాద్ కు వచ్చారు. పరేడ్ గ్రౌండ్ లో విజయ సంకల్ప సభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తల్లిదండ్రులతో కలిసి వారు గ్రౌండ్ కు వచ్చారు. V6 వారితో ముచ్చటించింది. చిన్నప్పటి నుంచి తనకు రెండు కోరికలున్నాయని.. ఒకటి డాడీ పని చేసే ఆఫీసు సీఈవోను కలవాలని ఉండేదని.. ఇది తీరిందన్నారు. మరొకటి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసి థాంక్స్ చెప్పాలని ఉందన్నారు. ఇప్పటి వరకు ఇది తీరలేదన్నారు. ఆయన దగ్గరికి తీసుకెళ్లేందుకు తమకు నేతలెవరూ లేరని తెలిపిన ఆమె తాము నార్మల్ సిటిజన్ లాగానే ఇక్కడకు రావడం జరిగిందన్నారు. అందరికీ ఛాన్స్ వస్తుందని..తమకు కూడా ఒక అవకాశం దక్కుతుందనే ఆశ తమలో ఉందన్నారు.

పరేడ్ గ్రౌండ్ కు వచ్చిన తర్వాత కలవాలని ఉందని..అవకాశం ఇవ్వాలని తాము ఈమెయిల్ పంపించినట్లు.. దీనికి సమాధానం రాలేదన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవడమే కాకుండా ట్రావెల్ చేశామన్నారు. మరికొంతమంది బీజేపీ నేతలతో తాము మాట్లాడినట్లు చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎందుకిష్టమో కూడా వెల్లడించింది. ప్రధాన మంత్రి అయ్యాక దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయని, అమ్మాయిల విషయంలో ఎన్నో చర్యలు తీసుకున్నారన్నారు. మోడీని కలిసే ఛాన్స్ వస్తే.. ఒక పెద్ద థాంక్స్ చెప్పాలని అనుకుంటున్నట్లు చెప్పారు.