వివేక హత్య కేసులో బీటెక్ రవిని విచారిస్తున్న సిట్

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో కడపలోని పోలీసు శిక్షణ కేంద్రంలో అనుమానితులను విచారిస్తున్నారు సిట్‌ అధికారులు . ఇవాళ (గురువారం) టిడిపి ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, సింహాద్రిపురం మండలం కసనూరుకు చెందిన కొమ్మా పరమేశ్వర్‌రెడ్డిలను విచారిస్తున్నారు.
గత నాలుగు రోజులుగా ఈ కేసుతో సంబంధం ఉన్న అనుమానితులను వరుసగా ఒక్కొక్కరిని విచారిస్తుంది సిట్. ఘటన జరిగి దాదాపు నాలుగు  నెలలైనా  ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు సేకరించకపోవంతో విచారణపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో విచారణను వేగవంతం చేసింది సిట్.

Latest Updates