దేశ ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది: సీతారాం ఏచూరి

దేశ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి. దేశ ప్రజల కొనుగోలు శక్తి రోజు రోజుకు పడిపోతోందని.. కేంద్ర ప్రభుత్వం మాత్రం దానిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేవలం మతాన్ని అడ్డం పెట్టుకుని.. అధికారంలో కొనసాగడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. దేశం తీవ్రమైన మాంద్యం వైపు వెళ్తోందన్నారు ఏచూరి. దానిపై కేంద్రానికి పట్టింపు లేదన్నారు. బడ్జెట్ లో చెప్పిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ను లూటీ చేశారని ఆరోపించారు. ఆర్బీఐలో ఇప్పుడు నిల్వలు ఏం లేవని.. అది కేవలం బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారిందని ఆరోపించారు ఏచూరి.

Latest Updates