ఆర్టీసీ కార్మికుల ఆందోళనతో బస్ భవన్ దగ్గర పరిస్థితి ఉద్రిక్తం

ఆర్టీసీ కార్మికుల సమ్మె 8వ రోజు కొనసాగుతోంది. ఆర్టీసీ డిపోల దగ్గర కుటుంబ సభ్యులతో కార్మికులు కళా భవన్ నుంచి బస్ భవన్ వరకు మౌన ప్రదర్శన నిర్వహించారు. తర్వాత బస్‌భవన్‌ దగ్గర కార్మికులు ఆందోళనకు సిద్ధమయ్యారు. కార్మికుల ఆందోళనకు పోలీసులు అనుమతి లేదని తేల్చి చెప్పారు. కార్మికులు ఆందోళనకు సిద్ధమవడంతో బస్‌ భవన్‌ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు బీజేపీ మద్దతు తెలిపింది.

Latest Updates