పరిస్థితి ఏం మారలేదు..రైతుల ఆందోళనలపై సుప్రీంకోర్ట్‌ కామెంట్‌

అగ్రి చట్టాలకు సంబంధించి అన్ని పిటిషన్లపై 11న విచారణ

రైతులు, కేంద్రం మధ్య చర్చలు జరగాలనే కోరుకుంటున్నం

న్యూఢిల్లీ: అగ్రి చట్టాల రద్దు, రైతుల ఆందోళనలపై దాఖలైన అన్ని పిటిషన్లను జనవరి 11న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తున్నామని.. రైతులు, కేంద్రం మధ్య చర్చలను ప్రోత్సహించాలనే తాము అనుకుంటున్నామని చెప్పింది. కానీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించట్లేదంది. కొత్త అగ్రి చట్టాలపై అడ్వొకేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ వేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సుప్రీంకోర్టు చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ.. రైతులతో చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే రెండు వర్గాల మధ్య అవగాహన కుదిరే అవకాశం ఉందని తెలిపారు. ఇరు వర్గాల మధ్య ప్రస్తుతం మంచి చర్చలు జరుగుతున్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పగా రైతులకు సంబంధించి అన్ని పిటిషన్లను జనవరి 8 న విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన సొలిసిటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శుక్రవారం మరో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చర్చలు జరగనున్నాయని చెప్పారు. రెండు వర్గాలు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందన్నారు. దీంతో కోర్టు అన్ని పిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జనవరి 11న విచారిస్తామంది.

వెనక్కి తగ్గని రైతన్న

ఢిల్లీలో వాన పడుతున్నా, చలి ఎక్కువవుతున్నా రైతులు ఆందోళన ఉధృతం చేస్తున్నారే తప్ప వెనక్కి తగ్గడం లేదు. వాతావరణం సరిగా లేకపోవడంతో బుధవారం నాటి ట్రాక్టర్ల ర్యాలీని గురువారానికి వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. ఉద్యమాన్ని మున్ముందు మరింత ఉధృతం చేస్తామన్నారు. అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఢిల్లీ బార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రైతులు నిరసన తెలుపుతున్నారు. ఇప్పటివరకు కేంద్రంతో ఏడు సార్లు చర్చలు జరిపారు. శుక్రవారం మరోసారి చర్చలు జరగనున్నాయి.

చట్టాల వెనుక ఐడియాను రైతులు అర్థం చేస్కోవాలె: తోమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రైతు చట్టాలు ఎందుకు చేశామో, వాటి వెనకున్న ఐడియా ఏంటో అర్థం చేసుకోవాలని  రైతు సంఘాలను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తోమర్ కోరారు. ఆ తర్వాత సరైన నిర్ణయానికి రావాలన్నారు. రైతుల సంక్షేమానికి సర్కారు కట్టుబడి ఉందని మరోమారు స్పష్టం చేశారు.

చట్టాలను మరోసారి పరిశీలించండి: విస్కాన్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: రైతుల ఆందోళనలపై విస్కాన్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసెంబ్లీ స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పందించారు. కొత్త రైతు చట్టాలపై మరోసారి పరిశీలించాలని కోరారు. రైతుల ఆందోళనకు సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నట్టు అమెరికాలో ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంబాసిడర్ తరంజిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంధూకు లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాశారు.

ప్రభుత్వ ఆఫీసుల తీరు మారాలి

సోషల్ మీడియాలో ఆడవాళ్లపై పెరిగిన వేధింపులు

రూ.50 లక్షల లోపు ఇండ్లకు ఫుల్ డిమాండ్

Latest Updates