మీరో రెండున్నరేళ్లు.. మేమో రెండున్నరేళ్లు

  • సీఎం సీటు.. డిప్యూటీ సీఎం సీటు పంచుకుందాం 
  • బీజేపీ – శివసేన ప్రభుత్వ ఏర్పాటుపై సంజయ్ రౌత్ కామెంట్

ముంబై: మహారాష్ట్రలో క్లియర్ మెజారిటీ దిశగా బీజేపీ – శివసేన దూసుకెళ్తోంది. 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో 145 చోట్ల గెలిచినోళ్లదే అధికారం పీఠం. మూడున్నర గంటల సమయానికి బీజేపీ – శివసేన కూటమి 157 సీట్లలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ – ఎన్సీసీ టీమ్ 98 చోట్ల లీడ్ లో కొనసాగుతోంది. సీఎం కుర్చీ మరోసారి బీజేపీ కూటమిదేనని క్లియర్ గా కనిపిస్తోంది. ఈ సమయంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తమ పార్టీ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.

50:50 ఫార్ములా

‘కౌంటింగ్ ట్రెండ్ క్లియర్ గా ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేంది బీజేపీ – శివసేన కూటమే. ఇందులో రెండో ఆప్షన్ లేదు. కాంగ్రెస్ – ఎన్సీపీతో కలిసే మాటేలేదు. గతం కంటే సీట్లు పెరిగినా, తగ్గినా బీజేపీతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. ఎన్నికల ముందు మాకు కుదిరిన ఒప్పందం 50:50 ఫార్ములానే. రెండున్నరేళ్లు బీజేపీ, రెండున్నరేళ్లు శివసేన లీడర్లు సీఎంగా ఉంటారు. దీనిపై మేం మా పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో మాట్లాడుతాం. ఆయన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో చర్చిస్తారు’ అని సంజయ్ రౌత్ అన్నారు. ఎన్నికల ముందు నుంచీ ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేను సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని శివసేన భావిస్తోంది. ఇప్పుడు 50:50 ఫార్ములా ప్రతిపాదనతో తమ టార్గెట్ ను నెరవేర్చుకోవాలని చూస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఈ చెరి సంగం పాలన గడిచే టైం లో కూడా సీఎం ఒక పార్ట నుంచి, డిప్యూటీ సీఎం మరో పార్టీ నుంచి ఉండాలని శివసేన కోరుతోంది.

 

Latest Updates