కళ్యాణి ప్రియదర్శినికి శక్తి ఎంటో చూపించాడు

కౌసల్యాకృష్ణమూర్తి సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన కోలీవుడ్ హీరో శివకార్తికేయన్‌.. శక్తి ది సూపర్ హీరో అనే సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.  పీఎస్‌ మిత్రన్‌ తెరకెక్కించిన ఈ మూవీలో శివకార్తికేయన్ సరసన కళ్యాణి ప్రయదర్శిని హీరోయిన్ గా నటించింది. యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్ సోమవారం రిలీజైంది. యాక్షన్‌, ఎమోషన్‌, డ్రామా బ్యాక్‌ డ్రాప్‌ లో వచ్చే సీన్స్ తో  ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

కళ్యాణి ప్రియదర్శిని ఈ మూవీతో తమిళంలోకి ఎంట్రీ ఇస్తోండగా..బాలీవుడ్‌ నటుడు అభయ్‌ డియోల్‌ కు కూడా తమిళ్‌లో ఇది ఫస్ట్ సినిమా.  చదువు ప్రాముఖ్యత చెప్తూ, విద్య పేరుతో జరిగే వ్యాపారం కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. యువన్‌ శంకర్‌ రాజా మ్యూజిక్‌ అందించిన ఈ సినిమా మార్చి 20న రిలీజ్ కానున్నట్లు తెలిపింది యూనిట్.

Latest Updates