రాష్ట్రంలో ఇవాళ ఆరు కరోనా పాజిటివ్ కేసులు: ఈటల

తెలంగాణలో కరోనా కేసులు గత వారం రోజులుగా తగ్గుముఖం పట్టాయని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇవాళ లేటెస్టుగా ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఈ కేసులన్నీ జీహెచ్ఎంసీ ఏరియాలోనే నమోదైనట్లు తెలిపారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1009కి పెరిగినట్లు తెలిపారు మంత్రి ఈటల.

రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ వైరస్‌ బారిన పడి 25 మంది మృతిచెందగా.. 374మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ ఒక్క రోజే 42మంది డిశ్చార్జ్ అయినట్టు మంత్రి ఆటల తెలిపారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 610మంది బాధితులు చికిత్స పొందుతున్నారని చెప్పారు.

Latest Updates