ఆరో కరోనా పాజిటివ్.. అవసరమైతేనే బయటకు రండి

రాష్ట్రంలో ఆరో పాజిటివ్ కేసు నమోదైందన్నారు మంత్రి ఈటెల. స్కాట్లాండ్ కు చెందిన 21 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా గుర్తించారన్నారు. ఎయిర్ పోర్టులో సైబరాబాద్ సీపీ,మరో ఇద్దరు పోలీస్ అధికారులు ప్రతీ వ్యక్తికి స్క్రీనింగ్ టెస్టు చేసి పంపిస్తున్నారన్నారు. ఎయిర్ పోర్టులో 40 బస్సులు సిద్ధంగా ఉంచామన్నారు. కరోనా లక్షణాలుంటే వెంటనే క్వారంటైన్ కు తరలిస్తున్నామన్నారు. విదేశాల్లో ఉన్నవారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు భారతదేశంలో ఇతర దేశాల నుంచి వచ్చిన వారికే కరోనా వైరస్ వచ్చిందన్నారు.

నిమ్స్, ఫీవర్, ఐపీఎం, ఉస్మానియా ,గాంధీ హాస్పిటల్లో ల్యాబ్ లు ఏర్పాటు చేశామన్నారు. 20 వేల మందికి సరిపడా క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్కూళ్లకు సెలవులిచ్చింది బయట తిరగడానికి కాదన్నారు. తల్లిదండ్రులు పిల్లలను బయటకు పంపొద్దన్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఈవెంట్లకు 200 మంది దాటొద్దన్నారు. ప్రభుత్వ ఆదేశాలను విస్మరించొద్దన్నారు. ప్రభుత్వం చెప్పేది తూచా తప్పకుండా పాటించాలని కోరారు. ఆఫీసుల్లో తప్పకుండా శానిటైజర్లు వాడాలన్నారు. హెల్త్ డిపార్ట్ మెంట్ కు సెలవులు రద్దు చేశామన్నారు.  కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఐసోలేషన్ లో ఆరోగ్యంగా ఉన్నారన్నారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు. మనిషికి మనిషి గజం దూరం ఉండాలన్నారు.

 

see more news

కరోనాపై కేరళ పోలీసుల డ్యాన్స్ వీడియో వైరల్

పంతాలు పట్టింపులు వదిలి.. కేంద్రం చెప్పింది చేయండి

విదేశాల్లో 276 మంది ఇండియన్స్‌కి కరోనా

Latest Updates