సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురు గల్లంతు

నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వలోకి కారు దూసుకెళ్లి ఆరుగురు గల్లంతయ్యారు. శుక్రవారం రాత్రి సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం శ్రీరంగాపురం వద్ద ఈ సంఘటన జరిగింది. హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్‌, నాగేశ్వర్‌, రాజేశ్‌, జాన్సన్‌, సంతోశ్‌, పవన్‌ సిటీలోనే ఓ హాస్పిటల్ లో పని చేస్తున్నారు. ఇదే ఆస్పత్రిలో పనిచేస్తున్న హేలకొండ మహేశ్‌ వివాహం ఉండటంతో ఆరుగురు కలిసి స్కార్పియో వాహనంలో చాకిరాలకు వచ్చారు. పెండ్లి తర్వాత తిరుగు ప్రయాణంలో శ్రీరంగాపురం వద్దకు చేరుకోగానే కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో అందులో ఉన్న ఆరుగురు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గల్లైంతనవారి కోసం గాలింపు చేపట్టారు.

Latest Updates