లాక్డౌన్ లో హెయిర్ కటింగ్.. ఆరుగురికి సోకిన కరోనా

ఒకే టవల్ వాడటం వల్ల ఒకరి నుంచి మిగతావారికి

కటింగ్ చేసిన బార్బర్ కి మాత్రం నెగిటివ్

హెయిర్ కటింగ్ కోసం బార్బర్ షాపుకి వెళ్లిన ఆరుగురికి కరోనా సోకిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఖార్గోన్ జిల్లాలోని బార్గాన్ గ్రామంలో కొంతమంది వ్యక్తులు కటింగ్ షాపుకు వెళ్లి కటింగ్ చేయించుకున్నారు. అక్కడ బార్బర్ షాపుకు వచ్చిన వారందరికీ ఒకే టవల్ వాడటంతో ఈ వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు.

గ్రామానికి చెందిన వ్యక్తి ఇండోర్‌లోని ఒక హోటల్‌లో పనిచేసేవాడు. అతడు లాక్డౌన్ మొదలైన తర్వాత ఈ మధ్యే గ్రామానికి వచ్చాడు. ఆ తర్వాత గ్రామంలో ఏప్రిల్ 5న జుట్టు కట్ చేయించుకున్నాడు. ఆ తర్వాత అతడు అనారోగ్యం పాలవడంతో ఆస్పత్రికి తరలించి పరీక్ష చేయగా అతనికి కరోనా పాజిటివ్ గా తేలిందని ఖార్గోన్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ దివ్యేష్ వర్మ తెలిపారు.

అదే రోజు అదే సెలూన్లో మరో 12 మంది హెయిర్ కట్ చేయించుకున్నారు. దాంతో వారందరి నమూనాలను పరీక్ష కోసం పంపారు. ఆ 12 మందిలో గ్రామానికి చెందిన ఆరుగురికి పాజిటివ్ గా తేలింది. అయితే.. వాళ్లందరికీ కటింగ్ చేసిన బార్బర్ కు మాత్రం పాజిటివ్ రాకపోవడం విశేషం. ఖార్గోన్ జిల్లాలో ఇప్పటివరకు 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. ఆరుగురు మరణించినట్లు జిల్లా వైద్యాధికారి తెలిపారు.

ఇప్పటివరకు దేశంలో 26,384 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారినపడి 826 మంది చనిపోయారు.

For More News..

ఇంటికో కోడి.. 10 గుడ్లు

PM కిసాన్ కొత్త లిస్టు విడుదల.. మీ పేరుందో లేదో ఇలా చెక్ చేసుకోండి..

సౌదీలో ఆ శిక్షను రద్దు చేసిన సుప్రీంకోర్టు

Latest Updates