ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం నేటితో పూర్తి

శాసనమండలిలో శుక్రవారంతో ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. వీరిలో మండలి చైర్మన్ స్వామిగౌడ్, పాతూరిసుధాకర్ రెడ్డి , షబ్బీర్ అలీ, సలీం, ఎంఎస్ ప్రభాకర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి ఉన్నారు . అయితేహైదరాబాద్ స్థానిక సంస్థల నుంచి ఎంఎస్ ప్రభాకర్ రావు తిరిగి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మండలి చైర్మన్గా స్వామిగౌడ్ పదవీకాలం ముగియటంతో కొత్త చైర్మన్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన మాజీ మంత్రి కడియం శ్రీహరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మండలి డిప్యూటీ చైర్మన్ గా ఉన్న నేతివిద్యాసాగర్ పేరు కూడా ఈ జాబితాలో ఉంది.

ఆ మూడింటికి జూన్ లో ఎన్నికలు?
రంగారెడ్డి , నల్గొండ, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో రంగారెడ్డి ,నల్గొండ స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన పట్నం నరేందర్ రెడ్డి , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్, మునుగోడు సీట్ల నుంచి ఎమ్మెల్యేలుగా గెలపొందటంతో ఆసీట్లు ఖాళీ అయ్యాయి. ఇక నిజామాబాద్ స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన భూపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి ఇటీవల జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పార్టీ మారిన వారిపై వేటు వేయాలని టీఆర్ఎస్ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి చైర్మన్ స్వామిగౌడ్ కు ఫిర్యాదు చేయటంతో సభ్యులనుంచి వివరణ తీసుకొని అనర్హత వేటు వేశారు. ఆ3 స్థానిక సంస్థల ఎమ్మెల్సీలకు లోక్ సభ ఎన్నికలుముగిశాక జూన్ లో జరిగే అవకాశముంది.

Latest Updates