ఓకే టవల్ తో 12 మందికి హెయిర్ కట్…ఆరుగురికి కరోనా పాజిటివ్

కరోనా వైరస్ … ఆ పేరు వింటేనే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు భయంతో వణికిపోతుంటే… కొంత మంది మాత్రం దాన్ని తేలికగా తీసుకుంటున్నారు. కరోనా గురించి అధికారులు అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా కూడా ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోక పోగా…ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తమ పాత పద్దతిలో పాటిస్తున్నారు. లేటెస్టుగా కటింగ్ షాప్ లో కటింగ్ చేసే పాత పద్దతిని అనుసరించడంతో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది.ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ఖర్ గోన్ లోని బర్గావ్ అనే గ్రామంలో సెలూన్ షాప్ ద్వారా ఆరుగురికి కరోనా వ్యాపించిందని అధికారులు గుర్తించి ఆ షాపుతో పాటు ఊరిని సీల్ చేశారు. కరోనా వచ్చిన వ్యక్తి ఆ సెలూన్ లో కటింగ్ చేయించుకున్నాడు అదే రోజు మరో 11 మంది కటింగ్ షేవింగ్ చేయించుకున్నారు. అయితే ఆ బార్బర్ అందరికి ఒకే టవల్ వాడటంతో వారందరికి కరోనా వచ్చిందని అధికారులు తెలిపారు. వైరస్ సోకిన వారిలో 28 ఏళ్ల నుంచి 73 ఏళ్ల వయసు వాళ్లు ఉన్నారు. అందరినీ క్వారంటైన్ కు తరలించారు.

Latest Updates