డిగ్రీతో ఎస్​ఎస్​సీలో 6 వేల జాబులు.. దరఖాస్తుకు ఆఖరుతేదీ..

స్టాఫ్ సెల‌క్షన్ క‌మిషన్ (ఎస్ఎస్‌సీ) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (సీజీఎల్‌) 2020 నోటిఫికేష‌న్​ రిలీజ్​ చేసింది. డిగ్రీ అర్హతతోనే సెంట్రల్​ కొలువుకు అవకాశం ఉన్న ఈ ఎగ్జామ్​కు అభ్యర్థులు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీలు:

గ్రూప్-బి గెజిటెడ్:           250

గ్రూప్-బి నాన్ గెజిటెడ్‌:   3513

గ్రూప్-సి:                       2743

మొత్తం:                        6506

పోస్టులు: అసిస్టెంట్ ఆడిట్ ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ అకౌంట్స్‌ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీస‌ర్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌క‌మ్ టాక్స్, జూనియ‌ర్ స్టాటిస్టిక‌ల్ ఆఫీస‌ర్, ఆడిట‌ర్‌, అకౌంటెంట్‌, సీనియ‌ర్ సెక్రటేరియ‌ట్ అసిస్టెంట్‌, టాక్స్ అసిస్టెంట్‌, స‌బ్ ఇన్‌స్పెక్టర్‌ ‌త‌దిత‌రాలు.

అర్హత‌: గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణత‌.

సెలెక్షన్ ప్రాసెస్​: నాలుగు అంచెలుగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. మొదటి రెండు ఎగ్జామ్స్​ ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహిస్తారు. మూడోది డిస్క్రిప్టివ్‌ ఎగ్జామ్​. నాలుగోది కంప్యూటర్‌ స్కిల్‌టెస్ట్‌ (టైపింగ్‌). ప్రతి పరీక్షలో కనీస అర్హత మార్కులు పొందినవారిని మాత్రమే తర్వాతి పరీక్షకు ఎంపిక చేస్తారు. ఆన్​లైన్​ ఎగ్జామ్​లో నెగెటివ్​ మార్క్స్​​ ఉంటాయి.

టైర్‌–1 పరీక్ష: ఇందులో 100 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటాయి.  60 నిమిషాల్లో పూర్తి చేయాలి. పేపర్​ నాలుగు విభాగాలుగా చేసి ప్రతి విభాగం నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. ఆబ్జెక్టివ్ తరహాలో పరీక్ష జరుగుతుంది.

టైర్‌–2 పరీక్ష:  క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ (పేపర్-1), ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ (పేపర్-2), స్టాటిస్టిక్స్ (పేపర్-3), జనరల్ స్టడీస్ (పేపర్-4) – ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్  విభాగాల నుంచి నాలుగు పేపర్లు ఉంటాయి. పేపర్-2 మినహా మిగతా పేపర్ లలో 200 మార్కులకు 100 ప్రశ్నలు ఇస్తారు.  ప్రతి పేపర్ కు 2 గంటల సమయం ఉంటుంది. అన్ని ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాల అభ్యర్థులు మాత్రమే పేపర్-3 రాయాల్సి ఉంటుంది. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసిన వారు మాత్రమే పేపర్ -4 హాజరు కావాలి.

టైర్‌–3 పరీక్ష: ఇది డిస్ర్కిప్టివ్ విధానంలో జరిగే పరీక్ష. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉంటుంది. ఎస్సే రైటింగ్, ప్రిసీస్, లెటర్, అప్లికేషన్ తదితరాలపై ప్రశ్నలు ఉంటాయి. ఒక గంట సమయంలో పరీక్ష పూర్తి చేయాలి.

టైర్‌–4 పరీక్ష: దీన్ని కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్ (సీపీటీ) లేదా డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ (డెస్ట్) అంటారు. అభ్యర్థులకు ఉన్న కంప్యూటర్ నాలెడ్జ్ ని, డేటాను టైప్ చేయడంలో ఉండే స్కిల్స్​ టెస్ట్​ చేస్తారు.

ముఖ్యసమాచారం

ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్​లో అప్లై చేసుకోవాలి.

అప్లికేషన్​ ఫీజు: జనరల్​ అభ్యర్థులకు రూ.100, ఎస్సీ/ ఎస్టీ/ స్త్రీ/ పీడ‌బ్ల్యూడీ/ ఎక్స్ స‌ర్వీస్‌మెన్ అభ్యర్థుల‌కు ఫీజు లేదు.

ఆన్‌లైన్ అప్లికేషన్స్​ స్టార్ట్​:  29 డిసెంబర్​ 2020

దరఖాస్తులకు చివ‌రితేది: 31 జనవరి 2021

ఆన్​లైన్​ పేమెంట్​ చివరి తేది: 2 ఫిబ్రవరి 2021

టైర్‌-1 ఎగ్జామ్​: 29 మే 2021 నుంచి 7 జూన్​ 2021 వ‌ర‌కు.

వెబ్ సైట్: https://ssc.nic.in

For More News..

బ్రెగ్జిట్ నుంచి వైదొలిగిన బ్రిటన్

తొమ్మిది నెలల తర్వాత తెరుచుకున్న స్కూల్స్

వీసాలపై నిషేధాన్ని పొడిగించిన ట్రంప్

Latest Updates