ఘోరం : అపార్టుమెంట్లో ఆరేళ్ల బాలుడు కరెంట్ షాక్ తో మృతి

రంగారెడ్డి జిల్లా: నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో కాళీమందిర్ PBEL సిటీలో దారుణం జరిగింది. అపార్టుమెంట్ సముదాయాల మధ్య ఉన్న స్థలంలో ఆడుకుంటూ ఉండగా చిన్నారి బాలుడికి కరెంట్ షాక్ తగిలింది. చుట్టూ కొంతదూరంలో మిగతావాళ్లు ఆడుకుంటూనే ఉన్నా… షాక్ కొట్టిన బాలుడిని ఎవరూ గుర్తించలేకపోవడంతో.. అతడు ప్రాణాలు కోల్పోయాడు.

నిన్న సోమవారం సాయంత్రం 6:30 సమయంలో మూసీన్ అనే ఆరేళ్ల బాలుడు… అపార్టుమెంట్ ముందు ఆడుకుంటున్నాడు.  లైటింగ్ కోసం అమర్చిన ఎలక్ట్రిసిటీ పోల్ వైర్లు బాలుడికి తగిలాయి. కరెంట్ షాక్ తగిలి ఆ బాలుడు అలాగే ఆ చెట్టుకు ఒరిగిపోయాడు. కొద్దిసేపటికి వరకు అతడిని ఎవరూ గమనించలేకపోయారు. బాలుడు మూసీన్ కు షాక్ తగిలిందని తెల్సుకున్న వాళ్లు వెంటనే అతడిని.. మెహిదీపట్నం దగ్గర్లోని ప్రీమియర్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్టు డాక్టర్ చెప్పారు.

మూసీన్ కుటుంబ సభ్యులు తమిళనాడుకు చెందినవారు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చారు. బాలుడిని సొంత ఊరు తీసుకెళ్లినట్టుగా SI రాఘవేందర్ తెలిపారు. మూసీన్.. బండ్లగూడ జాగీర్ లోని టైమ్ స్కూల్ లో 1వ తరగతి చదువుతున్నాడు. ఈ సంఘటనపై కాలనీ వాసులు సీరియస్ అయ్యారు. PBEL సిటీ సొసైటీ సభ్యుల నిర్లక్ష్యమే చిన్నారి ప్రాణం తీసిందంటూ ధర్నా చేశారు. నార్సింగి పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

 

Latest Updates