రూ. 50 ఇయ్యలేదని చిన్నారి ఆత్మహత్య

చేర్యాల, వెలుగు: ప్రాజెక్ట్​వర్క్ కోసం తల్లిదండ్రులు రూ. 50 ఇయ్యలేదని ఓ చిన్నారి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాలకి చెందిన పూస లక్ష్మి, నరసింహ దంపతుల కుమార్తె హన్సిక(11). గ్రామంలోని మోడల్ స్కూల్‌లో ఆరోతరగతి చదువుతోంది. స్కూల్ ప్రాజెక్టు వర్క్ కోసం రూ. 50 కావాలని తల్లిదండ్రులను అడగగా ఇవ్వకుండానే పనికి వెళ్లిపోయారు.. ఇద్దరూ డబ్బులియ్యలేదని హన్సిక ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. సమీపంలో ఉన్నవారు గమనించి తల్లికి సమాచారం అందించారు. సర్కారు దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది.

For More News..

బడులకు నిప్పు… సీబీఎస్ఈ ఎగ్జామ్స్ వాయిదా

యూత్‌కు ఉపాధి కోసం ‘కేసీఆర్ ఆపద్బంధు’

వెబ్‌సైట్‌లో ఇంటర్ హాల్ టికెట్స్

Latest Updates