కరోనా టైం వేస్ట్ ఎందుకు చేయడం.. పాటిద్దాం ఈ స్కిన్ టిప్స్

కరోనా లేకపోతే ఎవ్వరి పనుల్లో వాళ్లం ఉండిపోయేవాళ్లం. అన్నీ బాగుంటే ‘అబ్బా! ఎండలు మండిపోతున్నాయి’అని మాట్లాడుకునేవాళ్లం. ఇంట్లోనే ఉండటం వల్ల తెలియట్లేదుగానీ, బయట ఎండలు ఎప్పటిలాగే ఉన్నాయి. ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాం కదా అని స్కిన్ గురించి
పట్టించుకోవడం ఆపొద్దు. బయటికి వెళ్లకున్నా స్కిన్ విషయంలో తప్పక పాటించాల్సిన కొన్ని టిప్స్‌ చెప్తున్నారు డెర్మటాలజిస్ట్ డాకర్ వ్రితికా గడ్డం.

వేడి నీళ్లతో స్నానం వద్దు. అలాగే ఎక్కువ సేపు షవర్‌‌‌‌లో గడపొద్దు. షవర్ నుంచి బయటికి రాగానే మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
మాయిశ్చరైజర్ వాడటాన్ని అలవాటుగా చేసుకోవాలి. చేతులు, కాళ్లు, పాదాలు, మోచేతులకు మాయిశ్చరైజర్ తప్పనిసరిగా
రాసుకోవాలి.
లిప్ బామ్ క్యారీ చేయాలి. పెదాలు పగిలినట్టు అనిపిస్తే లిప్ బామ్ రాసుకోవాలి.
డ్రై స్కిన్ ఉన్నవాళ్లు మాయిశ్చరైజర్స్ రాయడంతో పాటు కొన్ని సప్లిమెంట్స్ కూడా తీసుకోవాలి. ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్.. డ్రై
స్కిన్ ఉన్నవాళ్లకు బాగా పనిచేస్తాయి.
బయటికివెళ్లినా, వెళ్లకపోయినా సన్ స్క్రీన్ వాడటాన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి.
రోజుకి కనీసం మూడున్నర నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి.

For More News..

జాతీయ ఖో-ఖో జట్టు కెప్టెన్ కు తిండి కష్టాలు

పేదల కోసం రోటీ బ్యాంక్.. 11 రోజుల్లో లక్షకు పైగా చపాతీల పంపిణీ

చెన్నై రోడ్లపై కరోనా ఆటో..

హౌజింగ్ మినిష్టర్ కు కరోనా పాజిటివ్

Latest Updates