టిఫిన్ తినకపోతే గుండె రోగాలు ఖాయం

టిఫిన్ తింటున్నారా? తింటే ఓకేగానీ.. తినకపోతేనే సమస్య అని అంటున్నారు అమెరికా ఐయోవా యూనివర్సిటీ సైంటిస్టులు. కారణాలేవైతేనేం చాలా మంది పొద్దున్నే టిఫిన్ తినకుండానే ఆఫీసులకు వెళ్లిపోతుంటారు. ఇంటి పనులు చూసుకుంటారు. కానీ, అదే డేంజర్ అని, టిఫిన్ తినని వారిలో 87 శాతం మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణించినట్లు సైంటిస్టులు తెలిపారు. టిఫిన్ తినకపోవడం వల్ల వచ్చే గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయని, దాని వల్ల గుండె జబ్బుల ముప్పు ఉంటుందని, 2016లో దాదాపు 1.52 కోట్ల మంది చనిపోయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోందని అంటున్నారు.

1988 నుంచి 1994 వరకు 40 నుంచి 75 ఏళ్లవయసున్న 6,550 మంది బ్రేక్ ఫాస్ట్ పై సైంటిస్టులుస్టడీ చేశారు. 2011 వరకు వాళ్ల ఆరోగ్య పరిస్థితిపైడేటా మెయింటేన్ చేశారు. 18.8 ఏళ్లలో 2,318మంది చనిపోగా, వారిలో 619 మంది గుండె సంబంధిత వ్యాధులతో చనిపోయినట్లు నిర్ధరించారు. డేటాను విశ్లేషిస్తే 5.1 శాతం మంది బ్రేక్ ఫాస్ట్ తీసుకునేవారు కాదని, 10.9 శాతం మంది అప్పుడప్పుడు బ్రేక్ ఫాస్ట్ చేసేవారని, 25 శాతం మందికొన్ని రోజులు మాత్రమే బ్రేక్ ఫాస్ట్ తీసుకునేవారని గుర్తించారు. 59 శాతం మంది మాత్రం ప్రతిరోజు బ్రేక్ ఫాస్ట్ మిస్ చేసేవారు కాదని తేలింది. రోజూ బ్రేక్ ఫాస్ట్ తీసుకునేవారితో పోలిస్తే తీసుకోనివారు గుండెవ్యాధులతో చనిపోయినట్లు గుర్తించారు. బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల ఒబెసిటీ పెరిగి, రక్తనాళాల్లో కొవ్వు పేరుకు పోతుందని, హై బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

Latest Updates