ఈ హెలికాప్టర్​కు పైలట్​ అవసరం లేదు

ఇప్పటిదాకా డ్రైవర్​ అవసరం లేకుండా దూసుకుపోయే కార్ల గురించి విన్నాం.. చూశాం. విమానాల గురించీ విన్నాం… వాటినే డ్రోన్లు అంటున్నాం. అంతేకాదు, విమానాలకు ఇప్పటికే ఆటోపైలట్​ మోడ్​ ఉండనే ఉంది. మరి, హెలికాప్టర్ల సంగతేంటి? దానికి సమాధానం మేం చెబుతామంటోంది అమెరికాకు చెందిన స్కైరైజ్​ అనే సంస్థ. అవును, పైలట్​ అవసరం లేకుండా ప్రయాణించే హెలికాప్టర్​ను తయారు చేసింది స్కైరైజ్​. తనంతట తానే ఎగిరే ఈ హెలికాప్టర్​కు లూనా అనిపేరు పెట్టింది. ఫెడరల్​ ఏవియేషన్​ అడ్మినిస్ట్రేషన్​ టెస్ట్​ చేసి ఆమోదించింది కూడా. ఇద్దరు స్టాండ్​ బై పైలట్లతో గాల్లోకి లేచిన లూనా, సక్సెస్​ఫుల్​గా ప్రయాణించింది. దీన్ని రెండు రకాలుగా వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఒకటి, మొత్తంగా పైలట్​ అవసరం లేకుండానే ప్రయాణించే వెసులుబాటు, ఇంకోటి, క్రూయిజ్​ కంట్రోల్​లాగా కేవలం గాల్లోకి లేచే వరకు ఆటోమేషన్​(దీనికి పైలట్​ గైడెన్స్​ తప్పనిసరి). హార్డ్​వేర్​, సాఫ్ట్​వేర్​, సెన్సర్ల సాయంతో లూనాను సక్సెస్​ఫుల్​గా టెస్ట్​ చేసినట్టు కంపెనీ చెప్పింది. ఇప్పటికే సుమారు రూ.270 కోట్లు (3.8 కోట్ల డాలర్లు) ఫండ్​ను రైజ్​ చేసింది కంపెనీ. దానికి తోడు ఇటీవలే మరో రూ.92 కోట్ల (1.3 కోట్ల డాలర్లు) ఫండ్​ వచ్చినట్టు కంపెనీ తెలిపింది. అన్నీ ఓకే అయితే, త్వరలోనే ఈ అటానమస్​ హెలికాప్టర్లను మార్కెట్లోకి తీసుకొస్తామని స్టార్టప్​ చెప్పింది.

SkyRise has built a helicopter that will fly without a pilot

Latest Updates