గ్రేటర్ వార్.. ట్విట్టర్‌‌‌‌‌‌‌‌లో సంజయ్ కేటీఆర్ మధ్య మాటల వార్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగుగ్రేటర్‌‌‌‌‌‌‌‌ పోరు వేళ బీజేపీ, టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ మధ్య ట్విట్టర్‌‌‌‌‌‌‌‌ వార్‌‌‌‌‌‌‌‌ ముదిరింది. బీజేపీని గెలిపిస్తే ఓల్డ్‌‌‌‌‌‌‌‌ సిటీపై సర్జికల్‌‌‌‌‌‌‌‌ స్ట్రైక్‌‌‌‌‌‌‌‌ చేస్తామని.. రోహింగ్యాలు, పాకిస్తానీలు, బంగ్లాదేశీయులను తరిమికొడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ చేసిన కామెంట్స్‌‌‌‌‌‌‌‌పై మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ స్పందించారు. ‘హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ప్రజల మీద ఎందుకు సర్జికల్‌‌‌‌‌‌‌‌ స్ట్రైక్‌‌‌‌‌‌‌‌ చేస్తారు. ఓట్ల కోసం కోటి మంది హైదరాబాదీలను బలితీసుకుంటారా?’ అని ప్రశ్నించారు. వాటికి సంజయ్‌‌‌‌‌‌‌‌ ఘాటుగా బదులిచ్చారు. ‘విదేశీ చొరబాటుదారుల ఓట్లతో ఎన్నికల్లో గెలవాలని పగటి కల కంటున్నారు. విదేశీ ద్రోహుల మీదే కాదు.. తెలంగాణ దోపిడీ దొంగల మీద కూడా సర్జికల్‌‌‌‌‌‌‌‌ స్ట్రైక్‌‌‌‌‌‌‌‌. అవినీతి, కుటుంబస్వామ్యం మీదా సర్జికల్‌‌‌‌‌‌‌‌ స్ట్రైక్‌‌‌‌‌‌‌‌’ అని హెచ్చరించారు.

కాంట్రాక్టుల దోపిడీ పైనా..

కాంట్రాక్టుల పేరుతో వేల కోట్ల దోపిడీలు, రియల్‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌ దందాలు, ఎత్తిపోతల పథకాల్లో జరిగిన అక్రమాలపై సర్జికల్‌‌‌‌‌‌‌‌ స్ట్రైక్‌‌‌‌‌‌‌‌ తప్పదని కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు సంజయ్‌‌‌‌‌‌‌‌ జవాబిచ్చారు. కేటీఆర్‌‌‌‌‌‌‌‌ స్నేహితుల డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ దందా, రియల్‌‌‌‌‌‌‌‌ గ్రాబింగ్స్‌‌‌‌‌‌‌‌పైనా స్ట్రైక్‌‌‌‌‌‌‌‌ తప్పదన్నారు. ప్రాజెక్టుల పేరుతో చేస్తున్న దందాలు, ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా ఉంటున్న వ్యక్తుల చీకటి వ్యవహారాలను తవ్వి తీస్తామని కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు హెచ్చరికలు పంపారు.

చొరబాటుదారుల ఓట్లతో గెలవాలనుకోవడం ప్రమాదకరం

మద్యం తాగి ప్రభుత్వాన్ని నడపడం రాష్ట్రానికే ప్రమాదకరమని సంజయ్‌‌‌‌‌‌‌‌ హెచ్చరించారు. చొరబాటుదారుల ఓట్లతో గెలవాలని చూడటం దేశానికి అంతకన్నా ప్రమాదకరమన్నారు. ప్రజలకు ట్విట్టర్‌‌‌‌‌‌‌‌ వేదికగా తాను చేసే చివరి విన్నపం ఇదేనని, అందరూ ఆలోచించాలని విన్నవించారు.

Latest Updates