చిన్న నత్త పెద్ద రైళ్లను ఆపేసింది

జపాన్​.. అనగానే పంక్చువాలిటీ గుర్తొస్తుంది. కానీ, ఆ పంక్చువాలిటీ మిస్సైంది. టైంకొచ్చే రైళ్లు ఆలస్యంగా నడిచాయి. డజన్ల సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి. 12 వేల మంది ప్రయాణికులకు ఇబ్బందులొచ్చాయి. దానికంతటికీ కారణం, ఒక్క నత్త. అవును, నత్తే. మే 30న జరిగిన ఈ ఘటనను తాజాగా రైల్వే అధికారులు బయటపెట్టారు.

ఇంతకీ, నత్త ఎలా కారణమంటారా? రైల్వే ట్రాక్​ పక్కనున్న కరెంట్​ ఇన్​స్టాలేషన్​లోకి ఆ నత్త వెళ్లిందట. దీంతో అది చచ్చిపోవడంతో పాటు కరెంట్​ సరఫరాలో ఇబ్బందులొచ్చాయట. ఎక్కడి రైళ్లు అక్కడే ఆగిపోయాయట. క్యుషు రైల్వే కంపెనీ అలియాస్​ జేఆర్​ క్యుషుకు చెందిన 26 రైళ్లపై దాని ప్రభావం పడిందట. అయితే, ముందు దానికి కారణమేంటో అధికారులు గుర్తించలేకపోయారు. పవర్​ గ్రిడ్​లోకి నత్త వెళ్లడంతో షార్ట్​ సర్క్యూట్​ అయ్యి ఇలా జరిగిందని తాజాగా తేల్చారు.

Latest Updates