రూ. 100 కోట్లు పోయినయ్!

అధికారులపై మంత్రి సత్యవతి రాథోడ్‌‌ ఫైర్‌‌ 

హైదరాబాద్‌‌, వెలుగు:  గిరిజనుల కోసం జరిగే పనుల్లో నాణ్యతా లోపం ఏమాత్రం ఉండొద్దని, నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌‌ హెచ్చరించారు. గిరిజన శాఖ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న పనులపై శాఖ కమిషనర్, కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూతో కలిసి సంక్షేమ భవన్ లో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. స్కూళ్ల భవనాలను ఫస్ట్ ప్రయారిటీతో పూర్తి చేయాలన్నారు. 2016లో మొదలు పెట్టిన పనులు ఇంకా కొనసాగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ల పనులు కూడా చాలా నెమ్మదిగా జరుగుతున్నాయని, పనులు వేగంగా చేయకపోవడం వల్ల దాదాపు రూ.100 కోట్లు వేరే శాఖకు ఇవ్వాల్సి వచ్చిందన్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈసారి బోనాల పండుగ లేనట్లే

నిజంగానే రాజ్​భవనం

అరటిపండ్లు అమ్ముతున్న టీచర్

Latest Updates