అతి చిన్న స్టెంట్‌‌‌‌

రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండెపోటు వస్తుంటుంది. అలాంటి వాళ్లకు చేసే ట్రీట్‌‌మెంట్‌‌లో మొదటి ఆప్షన్‌‌ స్టెంట్‌‌. మామూలు స్టెంట్లు కొంచెం పెద్దగానే ఉంటాయి. కానీ, తాజాగా స్విట్జర్లాండ్‌‌లోని జూరిక్‌‌కు చెందిన ఫెడరల్‌‌ ఇనిస్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ టెక్నాలజీ సైంటిస్టులు వాటన్నింటికన్నా అతిచిన్న స్టెంట్‌‌ను తయారు చేశారు. 40 రెట్లు చిన్నది. అయితే, అది గుండె రోగులకు మాత్రం కాదు. కొందరు చిన్నపిల్లల్లో వాళ్ల మూత్ర నాళాలు చిన్నగా ఉండి సరిగ్గా మూత్రం రాదు. కడుపులో ఉన్నప్పుడూ ఆ సమస్య కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాంటి పిల్లల కోసమే ఈ అతిచిన్న స్టెంట్‌‌ను తయారు చేశారు.

ప్రపంచంలోనే తొలిసారిగా 4డీ ప్రింటింగ్‌‌ టెక్నాలజీతో దీన్ని తయారు చేశారు సైంటిస్టులు.  గర్భంలో ఉన్నప్పుడు ఈ స్టెంట్‌‌‌‌ వేసినా కిడ్నీపై ప్రభావం పడదని చెబుతున్నారు.  ముందుగా లేజర్‌‌ కిరణాల ద్వారా త్రీడీ ప్రింటింగ్‌‌లో ఓ టెంప్లేట్‌‌ను తయారు చేశారు. ఆ తర్వాత దానిని కరిగిపోయే పాలిమర్‌‌ అచ్చులో పోశారు. దానిపైకి అల్ట్రావయొలెట్‌‌ కిరణాలను పంపి గట్టిపడేలా చేశారు. ఆ తర్వాత ఆ మొత్తం టెంప్లేట్‌‌ను తీసుకెళ్లి ఓ ద్రావణంలో పెట్టారు. పైన ఉండే పాలిమర్‌‌ అచ్చు కరిగిపోయి, ఈ స్టెంట్‌‌ మాత్రం మిగిలింది. ఇది చిన్నపిల్లల మూత్ర సంబంధిత రోగాలకు మంచి స్టెంట్‌‌గా నిలుస్తుందని సైంటిస్టులు భావిస్తున్నారు.

Latest Updates