సెకన్లలో కరోనాను చంపే బుల్లి గాడ్జెట్

జేబులో పట్టేంత యూవీ పరికరం

తయారు చేసిన ఐఐటీ గౌహతి స్టూడెంట్స్

గౌహతి: వైరస్ లు, బ్యాక్టీరియాలను జస్ట్ మూడు సెకన్లలోనే నాశనం చేయగలిగే పాకెట్ సైజ్ అల్ట్రా వయొలెట్ (యూవీ) డివైస్ ను ఐఐటీ గౌహతి స్టూడెంట్లు అనంత్ మిట్టల్, శుభమ్ యెన్నవార్ తయారు చేశారు. ‘యూవీ-అస్త్ర’ అనే ఈ డివైస్ తో డోర్ హ్యాండిల్స్, లిఫ్ట్ బటన్లు, పీపీఈ కిట్ల వంటి వస్తువులపై మూడు సెకన్లలోనే వైరస్ లను చంపొచ్చని వారు వెల్లడించారు. ఈ డివైస్ చాలా తక్కువ స్థాయిలో యూవీ లైట్ ను ఉపయోగిస్తుందని, దీనితో మనుషులకు ఎలాంటి రిస్క్ ఉండదన్నారు. మూడు సెంటీమీటర్ల పొడవు, 10 గ్రాముల బరువు మాత్రమే ఉండే ఈ డివైస్ 99.9 శాతం వైరస్ లను చంపగలదని, 5 వేల గంటలు పని చేస్తుందని వివరించారు.

Latest Updates