గూగుల్​ అసిస్టెంట్​తో స్మార్ట్​ కంట్రోల్

 

ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్​ ఫోన్ పై గూగుల్​ అసిస్టెంట్​పని చేస్తుంది. గూగుల్​ అసిస్టెంట్​ను రెగ్యులర్​గా మొబైల్​ ఫోన్​లో మెసేజెస్​ చదవడం, మ్యూజిక్​ ప్లే చేయడం వంటి పనులకే కాకుండా స్మార్ట్​డివైజెస్​ను కంట్రోల్ చేసేందుకు కూడా వాడొచ్చు. గూగుల్​ అసిస్టెంట్​ను ‘గూగుల్​ హోమ్ మిని, గూగుల్​ హోమ్​ మ్యాక్స్, గూగుల్​ హోమ్​ హబ్, గూగుల్​ నెక్ట్స్​హబ్ మ్యాక్స్ తోపాటు థర్డ్​పార్టీ డివైజెస్​ అయిన ‘సోనోస్​ వన్​స్పీకర్, టిక్​వాచ్​ఈ2’​ వంటి డివైజ్​లతో కనెక్ట్​ చేసుకోవచ్చు. లేటెస్ట్ గా వస్తున్న ‘ఫిలిప్స్​ హ్యూ లైట్​బల్బ్స్, రోబో వ్యాక్యూమ్స్, నెస్ట్​థర్మోస్టాట్–ఈ, నెస్ట్​ క్యామ్​ ఐక్యూ’ వంటి స్మార్ట్​గ్యాడ్జెట్స్ ను​ కూడా  గూగుల్​ అసిస్టెంట్ తో కంట్రోల్​ చేయొచ్చు.

వీటిని గూగుల్​ అసిస్టెంట్​తో కనెక్ట్​ చేయాలంటే యాప్​ ఓపెన్​చేసి, ‘యాడ్’పై ట్యాప్​ చేయాలి. తర్వాత ‘సెటప్​ డివైజ్’> ‘సెటప్​ న్యూ డివైజెస్’ > లొకేషన్​సెలెక్ట్  చేసుకుని ‘నెక్స్ట్’పై ట్యాప్​ చేసి, మిగతా స్టెప్స్​ కంప్లీట్​ చేయాలి. అంతే మీకు కావాల్సిన స్మార్ట్​ డివైజెస్​ కనెక్టవుతాయి. దీంతో గూగుల్​ అసిస్టెంట్​ ద్వారా ‘టర్న్​ ఆఫ్​ లైట్స్, టర్న్​ డౌన్​ థర్మోస్టాట్, ‘షో ద ఫ్రంట్​ డోర్​ కెమెరా’ వంటి కమాండ్స్ తో డివైజెస్​ను ఆపరేట్​ చేయొచ్చు.

 

Latest Updates