
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల ఇండస్ట్రీ దూకుడు కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది రెండో క్వార్టర్లో కంపెనీలు 3.69 కోట్ల స్మార్ట్ఫోన్లను షిప్పింగ్చేశాయి. గత ఏడాది క్యూ2తో పోలిస్తే 9.9 శాతం, గత క్వార్టర్‌తో పోలిస్తే 14.8 శాతం పెరుగుదల కనిపించిందని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) తెలిపింది. చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమీ షిప్మెంట్లు వార్షికంగా 4.8 శాతం, దక్షిణ కొరియా కంపెనీ శామ్సంగ్ షిప్మెంట్లు 16.6 శాతం పెరిగాయి. తక్కువ, మధ్యస్థాయి స్మార్ట్ఫోన్లకు డిమాండ్ పెరగడమే ఇందుకు కారణం. ‘‘షోరూమ్‌ల ద్వారా స్మార్ట్ఫోన్ల అమ్మకాలు పెంచడానికి కంపెనీలు చాలా శ్రమించాయి. అయినప్పటికీ ఆన్లైన్ సేల్స్ తగ్గలేదు. కొత్త మోడల్స్ , ఆకర్షణీయమైన ఆఫర్లు, నోకాస్ట్ ఈఎంఐల వంటివి ఇందుకు కారణం’’ అని ఐడీసీ పేర్కొంది.