స్మార్ట్ టీవీ కొంటున్నారా… జాగ్రత్త

smart-tv-hacking-issue

ఈ రోజుల్లో ఎక్కువగా స్మార్ట్ టీవీనే కొనుక్కుంటున్నారు యూజర్లు. కొత్తగా అమ్ముడవుతున్న వాటిలో స్మార్ట్ టీవీల వాటానే ఎక్కువ. ఇంటర్నెట్ తో, మొబైల్ ఫోన్ తో కనెక్ట్ చేసుకునే అవకాశం ఉండటం, కేబుల్ తో పని లేకుండా వై–ఫై ద్వారా ‘నెట్ ఫ్లిక్స్, అమెజాన్’ వంటి స్ట్రీమింగ్ యాప్స్ ద్వారా వీడియోలు చూసే అవకాశం ఉండటం వంటి అనేక కారణాలతో అందరూ స్మార్ట్ టీవీలవైపే మొగ్గు చూపుతున్నారు. అయితే స్మార్ట్ టీవీలు హ్యాకింగ్ కు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వీటివల్ల మీ వ్యక్తి గత సమాచారం హ్యాకర్ల చేతికి వెళ్లొచ్చు. టీవీల ద్వారా మిమ్మల్ని హ్యాకర్లు చూస్తూ నే ఉంటారు.

స్మార్ట్ టీవీ అనే కాదు.. ఇంటర్నెట్ తో కనెక్టయ్యే ఎలాంటి డివైజ్ అయినా హ్యాకింగ్ కు గురయ్యే అవకాశం ఉంది. స్మార్ట్ టీవీలు ఇంటర్నెట్ కేబుల్, మొబైల్ ఫోన్, రౌటర్ ద్వారా వై–ఫైతో కనెక్టై ఉంటాయి. టీవీ, పర్సనల్ కంప్యూటర్, ల్యా ప్ టాప్ వంటి ఏ డివైజ్ లోకి హ్యాకర్ చొరబడ్డా , ఒకదాని నుంచి మరో దా నికి ఈజీగా కనెక్టైపోతారు. అందువల్ల మీకు సంబంధించిన మొత్తం ఆన్ లైన్ యాక్టివిటీస్, డేటా వంటివి హ్యాకర్ల చేతికి వెళ్లే అవకాశం ఉంది. అందుకే కొన్ని జాగ్రత్తలుతీసుకుం టే ఈ పరిస్థితి నుంచి రక్షించుకోవచ్చు.

కొన్ని స్మార్ట్ టీవీలకు కెమెరా కూడా ఉంటుంది. వాటి ద్వారా ఆన్ లైన్ కాల్స్ చేసుకోవచ్చు. అయితే స్మార్ట్ టీవీ హ్యాకింగ్ కు గురైతే, కె మెరాను కూడా హ్యాకర్లు యాక్సెస్ చేయగలుగుతారు. మీకు తెలియకుండా కె మెరాను ఆన్ చేసి దాని ఎదురుగా ఉండే ప్రతి దృశ్యాన్ని రికార్డు చేయగలరు. ఇది యూజర్లకు సంబంధించిన ప్రైవసీని దెబ్బతీస్తుంది. గదిలో లేదా హా ల్ లోని యాక్టివిటీస్ అన్నిం టినీ హ్యాకర్లు గమనిస్తుం టారు. ఒకవేళ మీ స్మార్ట్ టీవీకి కె మెరా ఉంటే దానిపై యాంటీ కెమెరా క్లిప్స్ పెట్టి ఉంచండి. లేదా చిన్న టేప్ లాంటివి అతికించి కెమెరా క్లోజ్ చేయండి.

స్మార్ట్ టీవీలు సాఫ్ట్ వేర్ తో రూపొందుతాయి. అయితే సాఫ్ట్ వేర్ లోని లోపాల ఆధారంగా,  ఇంటర్నెట్ ద్వారా వైరస్ చొప్పించి టీవీలను హ్యాక్ చేస్తారు. టీవీ హ్యాకింగ్ కు గురి కాకూడదనుకుం టే ఎప్పటికప్పుడు సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేసుకోవాలి. అలాగే టీవీలో వాడే ‘యూట్యూబ్, నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో’తోపాటు అన్ని యాప్స్ ను అప్ డేట్ చేసుకుంటూ ఉండాలి.

ఇతరుల నుంచి తీసుకున్న యూఎస్ బీ స్టిక్స్, పెన్ డ్రైవ్ లు వంటివి కనెక్ట్ చేయకూడదు. టీవీ స్క్రీన్ పై కనిపించే ప్రతి మెసేజ్ ను ఓపెన్ చేయకూడదు. సెట్టిం గ్స్ లోకి వెళ్లి ‘స్మార్ట్ సెక్యూ రిటీ’ ఆన్ చేసుకోవాలి.

Latest Updates