నవ్వు అన్ని రకాల వ్యాధులను నయం చేస్తుంది : CS

సైఫాబాద్ , వెలుగు: మానవ జీవితంలో నవ్వు ముఖ్యమైనదని, నవ్వు మనసుకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి తెలిపారు. అంతర్జాతీయ నవ్వుల దినోత్సవాన్న పురస్కరించుకొని ఏబీసీ లాఫర్ , యోగా సెంటర్ ఆధ్వర్యంలో గన్ పార్క్ నుంచి నాంపల్లి పబ్లిక్ గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు. గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో జోషి మాట్లాడుతు ..నవ్వు అన్ని రకాల వ్యాధులను నయం చేస్తుందన్నారు. దానికి అంతటి శక్తి ఉన్నదన్నారు. ఆరోగ్యంగా నూరేళ్లు హాయిగా నవ్వుకుంటూ ఉండటం కోసమే లాఫింగ్ క్లబ్ ను ప్రారంభించినట్లు సంస్థ ప్రతినిధులు సత్యనారాయణ, డాక్టర్ భానుమతి వివరించారు. వీటిని జిల్లాలకు కూడా విస్తరింపజేస్తామని తెలిపారు.

Latest Updates