మిషన్ భగీరథ పనులను పరిశీలించిన స్మితా సబర్వాల్

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా మాణిక్ గూడ దగ్గర మిషన్ భగీరథ పనులను పరిశీలించారు CMO ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్. గ్రౌండ్ లెవల్లో పనులు పరిశీలించి..ఆ తర్వాత సమీక్ష నిర్వహించారు. అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. నెలరోజుల్లో ఇంటింటింకీ నల్లా ఇవ్వాలని ఆదేశించారు. అక్కడి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ దగ్గర నిర్మించిన మిషన్ భగీరథ ఇంటెక్ వెల్ ను పరిశీలించారు స్మితా సబర్వాల్… ప్రారంభానికి సిద్ధంగా ఉన్నచోట ట్రయల్ రన్స్ నిర్వహించాలన్నారు. ఏప్రిల్ 15లోగా.. పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలన్నారు స్మితా.

Latest Updates