స్మిత్‌‌ టెక్నిక్‌‌ చాలా క్లిష్టం: సచిన్‌‌

న్యూఢిల్లీ: పరిస్థితులకు తగ్గట్టుగా తనను తాను మల్చుకోవడంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌‌ స్టీవ్‌‌ స్మిత్‌‌ దిట్ట అని బ్యాటింగ్‌‌ లెజెండ్‌‌ సచిన్‌‌ టెండూల్కర్‌‌ కితాబిచ్చాడు.  ‘కాంప్లికేటెడ్‌‌ టెక్నిక్‌‌.. కానీ ఆర్గనైజ్‌‌డ్‌‌ మైండ్‌‌సెట్‌‌’ అంటూ మాస్టర్‌‌ ట్వీట్‌‌ చేశాడు. ఈ సందర్భంగా  స్మిత్‌‌కు మాత్రమే సాధ్యమైన టెక్నిక్‌‌ను సచిన్‌‌ సోషల్‌‌ మీడియాలో విశ్లేషించాడు.

Smith has complicated technique but an organised mindset: Tendulkar‘తొలి టెస్ట్‌‌లో స్మిత్‌‌ను స్లిప్స్‌‌, గల్లీలో ఔట్‌‌ చేసేందుకు ఇంగ్లిష్‌‌ బౌలర్లు ప్రయత్నించారు. కానీ దీని నుంచి తప్పించుకునేందుకు స్మిత్‌‌.. తన స్టాన్స్‌‌ మార్చేసుకున్నాడు. లెగ్‌‌ స్టంప్‌‌ను వదిలేసి మిగతా రెండు వికెట్లను కవర్‌‌ చేస్తూ క్రాస్‌‌ బ్యాటింగ్‌‌ చేశాడు. ఇది చాలా తెలివైన నిర్ణయం.

లార్డ్స్‌‌ టెస్ట్‌‌లో స్మిత్‌‌ బ్యాటింగ్‌‌ చేస్తున్నప్పుడు లెగ్‌‌ స్లిప్‌‌ పెట్టారు. ఆర్చర్‌‌ కొన్ని షార్ట్‌‌ పిచ్‌‌ బంతులతో ఇబ్బందిపెట్టాడు. దీనిని అధిగమించేందుకు లైన్‌‌ను కవర్‌‌ చేస్తూ బ్యాక్‌‌ఫుట్‌‌ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బౌన్సర్‌‌కు గాయపడ్డాడు.

ఇలాంటి సందర్భాల్లో ఏ బ్యాట్స్‌‌మన్‌‌ అయినా తలను ఫార్వర్డ్‌‌ దిశలో పెట్టి ఆడాలి. లేదంటే స్వల్పంగా పక్కకు వంచాలి. కానీ ఈ రెండింటికి భిన్నంగా అతను తల అడ్డంగా పెట్టడం వల్లే గాయ పడ్డాడు. ఇది కరెక్ట్‌‌ పొజిషన్‌‌ కాదు. చివరి రెండు టెస్ట్‌‌లకు వచ్చేసరికి అతని స్టాన్స్‌‌ మళ్లీ మారింది. ఈసారి తలను ఫార్వర్డ్ దిశలో పెట్టి చాలా బంతులను వదిలేశాడు. పొజిషన్‌‌ పరంగా చాలా మెరుగయ్యాడు. అంటే టెక్నిక్‌‌పై స్మిత్‌‌ చాలా తెలివిగా వర్క్‌‌ చేశాడు. అందుకే టెక్నిక్‌‌ క్లిష్టంగా ఉన్నా.. పరిస్థితులకు తగ్గట్టుగా మైండ్‌‌సెట్‌‌ను మార్చుకుంటూ బ్యాటింగ్‌‌ చేస్తాడు’ అని మాస్టర్‌‌ చెప్పుకొచ్చాడు.

Latest Updates