
ఐసీసీ టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్ చటేశ్వర్ పుజారాను ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వెనక్కునెట్టాడు. యాషెస్ తొలి టెస్ట్‌లో రెండు సెంచరీలు చేసిన స్మిత్(903 పాయింట్లుతో) ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి చేరాడు. ఈ క్రమంలో పుజారా(881) నాలుగో ర్యాంక్‌కు పడిపోయాడు. ఈ జాబితాలో కోహ్లీ(922) టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా, కేన్ విలియమ్సన్(913) సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. యాషెస్ ఫస్ట్ టెస్ట్‌లో తొమ్మిది వికెట్లు తీసిన ఆసీస్ స్పిన్నర్ నేథన్ లైయన్ బౌలర్ల విభాగంలో ఆరు స్థానాలు ఎగబాకి 13వ ర్యాంక్‌కు చేరగా, పేసర్ పాట్ కమిన్స్ టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు.