స్మృతి ఇరానీ లవర్స్ డే సందేశం: యూత్ ఫిదా

న్యూఢిల్లీ:  వాలంటైన్స్ డే.. ప్రేమికులకు పండుగ రోజు. ప్రేమ జంటలకు స్పెషల్ డే. వారి ఆనందానికి అవధులు ఉండవు ఈ రోజున. మరి ఒంటరి యువతీ, యువకుల మాటేమిటి?? కొందరు వారివారి పనుల్లో బిజీగా ఉంటే.. కొద్ది మంది మాత్రం తమకు లవర్ లేకపోయనే అనే నిరాశలో ఉంటారు. ఇలాంటి వారికి స్ఫూర్తినిచ్చేలా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తనదైన శైలిలో వాలంటైన్స్ డే సందేశాన్నిచ్చారు. ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి యువత మనసు గెలుచుకున్నారు.

ఇన్ స్టాగ్రామ్ లో తన ఫొటోతో పాటు ఓ కోట్ రాశారు. ‘‘మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ రోజును గడపండి. మీ విజయాలను గుర్తు చేసుకోండి. జీవిత ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకోండి. ధైర్యంగా కలలు  కనండి. వాటిని సాకారం చేసుకోవాలనే ఆశను వదులుకోవద్దు. మీ రోజును భారంగా గడపొద్దు’’ అని యువతకు స్మృతి ఇరానీ  సూచించారు.

ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పోస్టుకు యువత ఫిదా అయిపోయింది. కొందరు వాలంటైన్స్ డే శుభాకంక్షలు చెప్పారు. ఆమె సెన్సాఫ్ హ్యూమర్ కు తాము ఎప్పటి నుంచో ఫ్యాన్స్ అని, ఈ పోస్టుతో ఆమె ఎంత మంచివారో మరోసారి అర్థమైందని ఓ యువకుడు పోస్ట్ చేశాడు. బీజేపీ నాయకురాలు అయ్యుండి ఇలాంటి పోస్టు పెట్టడం ఆమె మంచిని ఎలా ప్రోత్సహిస్తారన్న దానికి నిదర్శనమని ఓ అభిమాని అన్నాడు.

Latest Updates