అనుచరుడి పాడె మోసిన ఎంపీ స్మృతి ఇరానీ

తన అనుచరుడి భౌతికకాయాన్ని భుజాలపై మోశారు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరాని. తమ పార్టీ కార్యకర్త, బరూలియా గ్రామ మాజీ సర్పంచ్‌ అయిన సురేంద్రసింగ్‌ ను శనివారం రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగలు దారుణంగా హత్య చేసి చంపారు. తన అనుచరుడి మరణ వార్త తెలుసుకున్న స్మృతి ఇరానీ అతని గ్రామానికి వెళ్లి, మృతుని కుటుంబ సభ్యులను  ఓదార్చారు.

ఆ తర్వాత అతని అంత్యక్రియల్లో పాల్గొన్నారు స్మృతి . అంత్యక్రియల్లో భాగంగా అతని పాడె మోశారు.  కాగా ఈ హత్య కేసుపై పోలీసులు ఇప్పటికే విచారణ మొదలెట్టారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

Latest Updates