మాస్కులు ఎలా తయారు చేసుకోవాలో చెప్పిన స్మృతి ఇరానీ

  • ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు షేర్‌‌

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో బయటకు వచ్చే ప్రజలంతా కచ్చితంగా మాస్క్‌ ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో బయట మాస్కుల కొరత ఉన్న కారణంగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. అలాంటి ఇబ్బంది ఏమీ అవసరం లేదని, మాస్కులు మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. ఈ మేరకు ఆమె మాస్కు తయారు చేస్తున్న ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా ప్రజలతో పంచుకున్నారు. ఇంట్లో ఉండే క్లాత్‌తో మనమే మాస్క్‌ తయారు చేసుకోవచ్చని అన్నారు. “ ఇంట్లో నే మాస్కులు తయారు చేసుకోవచ్చు. మిషన్‌ లేకపోతే సూదీ దారం ఉపయోగించి చేతితోనే కుట్టుకోవచ్చు” అని ఆమె మాస్క్‌ తయారు చేస్తున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఆమెతో పాటు బీజేపీకి చెందిన కొంత మంది మహిళా ఎంపీలు, మహిళా మోర్చా సభ్యులు కూడా మాస్కులు తయారు చేస్తున్నారు.

Latest Updates