కాటేసిందని కొరికేశాడు.. పాము కూడా చనిపోయింది

snake-bites-70-years-old-man-and-he-bites-back-it-both-died

పాము విషం మనిషికి ప్రాణాంతకం. అందుకే పామంటే మనిషికి చాలా భయం. విష త్రాచులు కనిపించినప్పుడు.. దానికి దూరంగా జరగడమో… లేదా.. కట్టెతో కొట్టి చంపడమే ఏదో ఒకటి చేస్తుంటాడు. గుజరాత్ లో ఓ రైతు… తనను కుట్టిన పాముపై మరో రకంగా ప్రతీకారం తీర్చుకున్నాడు.

మహిసాగర్ లో ఉండే రైతు పర్వత్ గాలా బరియా(70).. ఇటీవల పొలానికి వెళ్లాడు. అక్కడ అతడిని ఓ పాము కరిచింది. బాధతో పాపం బాగా అరిచాడు. అక్కడే కుప్పకూలిపోయాడు. ఆ పామును పట్టుకున్నాడు. కోపంలో దాన్ని తన నోటితో గట్టిగా కొరికేశాడు. పొలం పనులకు అక్కడికి వచ్చిన కుటుంబసభ్యులు… రైతు పర్వత్ గాలాను దగ్గర్లోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. పాము కాటుకు ట్రీట్ మెంట్ దొరక్కపోవడంతో.. అలా.. మూడు హాస్పిటళ్లు తిప్పారు. అంతలోనే ఆ రైతు ప్రాణం కోల్పోయాడు.

రైతు కొరికేయడంతో… రెండు ముక్కలైన ఆ పాము కూడా పొలంలోనే చచ్చిపోయింది.

Latest Updates