కట్లపాము కరిచి 20 ఏళ్ల యువకుడు మృతి

పాము కాటుకు 20 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి నారాయణపేట జిల్లాలో జరిగింది.  మాగనూరు మండలంలో  నేరేడుగం గ్రామంలో ఆరు బయట నిద్రిస్తున్న రహీమ్ పాషా అనే యువకుడిని పాము కరవడంతో నొప్పి భరించలేక వెంటను గట్టిగా అరిచాడు. పక్కనే ఉన్న యువకుడి తండ్రి పామును చంపేసి, కొడుకును హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. అయితే మార్గమధ్యలోనే రహీం అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు డాక్టర్లు. రహీం పాష  20 సంవత్సరాల యువకుడు.

కట్ల పాముకు త్రాచుపాముకన్న రెట్టింపు విషం ఉంటుందని ..అది క్షణాల్లో శరీరంమొత్తం నిండుతుందని చెప్పుకొచ్చారు డాక్టర్లు. వయసుకు వచ్చిన కొడుకు చనిపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు తల్లిదండ్రులు.

Latest Updates