స్కూటీలో నాగు పాము

  • బైక్ డోమ్ నుంచి బయటికి తీసిన మెకానిక్

స్కూటీ డోమ్ లో నుంచి పాము బయటపడ్డ ఘటన కీసర పీఎస్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం చీకటి మామిడి గ్రామానికి చెందిన రాములు చర్లపల్లిలోని ఎఫ్ఎస్ఐలో పనిచేస్తున్నాడు. మంగళవారం రాములు  స్కూటీపై రాంపల్లి నుంచి చర్లపల్లి వెళ్తున్నాడు. మహంకాళి టెంపుల్ వద్దకు రాగానే రాములు చేతిని ఏదో తాకుతున్నట్టు అనిపించి వెహికల్ పక్కకు ఆపి చూడగా పాము కనిపించింది. వెంటనే రాములు స్కూటీకి కిందపడేసి పక్కకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న మహంకాళి టెంపుల్ చైర్మన్ వినోద్ గౌడ్  మెకానిక్ మైసయ్యను పిలిపించి..స్కూటీ డోమ్ లో ఉన్న పామును బయటికి తీయించాడు.

Latest Updates