ATM సెంటర్ లో పాము

మనీ డ్రా చేసేందుకు ATM లోకి వెళ్లిన కస్టమర్లు అక్కడ పామును చూసి ఒక్క సారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. కొయంబత్తూర్‌ తనీర్‌పాండల్‌ లోని IDBI బ్యాంక్ ATM మనీ డ్రా చేసేందుకు వచ్చిన కస్టమర్లకు బుసలు కొడుతున్న పాము కన్పించింది. పామును చూసి భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ విషయాన్ని ఏటీఎం సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. పాములు పట్టే వ్యక్తిని తీసుకువచ్చారు పోలీసులు. పాము కంప్యూటర్లు ఉన్న గదిలోపలికి వెల్లడంతో అక్కడి సామాగ్రిని తిలగించి.. పామును పట్టుకున్నాడు. తర్వాత సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Latest Updates