తిరుమల క్యూలైన్ లో పాము కలకలం

తిరుపతి: తిరుమలలో భక్తులు బస చేసే కాటేజీల దగ్గర కాలనాగులు కలకలం సృష్టిస్తున్నాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు వెళ్లే క్యూలైన్ల మధ్యనున్న ప్రదేశానికి శనివారం నాగుపాము చేరి బుసలు కొట్టింది. గమనించిన పారిశుద్ద సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. గంటసేపు ఉత్కంఠ నెలకొన్న తర్వాత భారీ సర్పాన్ని స్నేక్ క్యాచర్ పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

లాక్ డౌన్ ప్రభావంతో భక్తుల సంచారం పెద్దగా లేకపోవడం ఎవరికీ ఎలాంటి హాని జరగలేదన్నారు TTD అధికారులు.  స్నేక్ క్యాచర్ సురక్షితంగా పాముని పట్టుకుని సమీప అడవుల్లోకి వదిలేశాడు. అయితే లాక్ డౌన్ ప్రభావంతో కొద్దీ రోజులుగా జనసంచారం లేకపోవడంతో.. అక్కడికి పాములు చేరుకున్నట్లు చెబుతున్నారు TTD సిబ్బంది. సాధారణంగా ఈ ప్రాంతంలో నిత్యం వాహన రాకపోకలతోను, క్యూలైన్లో వెళ్లే భక్తులతో ఎంతో రద్దీగా ఉంటుంది.

Latest Updates